Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బోలేరో వాహనం బోల్తా పడి 10 మంది మృతి

సిమ్లా : హిమాచల్‌ ప్రదేంశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోర్‌ జిల్లా హయిల్స్‌కు చెందిన బోలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరు…

బీఎస్‌ఆర్‌, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ

బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ…

మైరుగైన చికిత్స కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించారు

ఇస్లామాబాద్‌: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌ వాసి సరబ్‌జిత్‌ సింగ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు విదేశాలకు పంపే అంశంపై పాక్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. మరోవైపు లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సరబ్‌జిత్‌ అరోగ్యం…

ఢాకా బాధితులను పరామర్శించిన హసినా

ఢాకా, జనంసాక్షి: గతవారం ఢాకాలో ఎనిమిదంస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా సందర్శించారు. సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ నెల 24న రాణా ప్లాజా వాణిజ్య…

పెషావర్‌లో ఆత్మాహుతి దాడివల్ల ఆరుగురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెషావర్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా అత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 40 మంది గాయాలయ్యాయి. వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

నేటి నుంచి జార్ఖండ్‌లో రాష్ట్రపతి పర్యటన

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్‌, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

భవనం కూలిన ప్రమాదంలో 397మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో 8 అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 397కి చేరింది. శిధిలాల వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని సోహెల్‌ను కమాండో దళాలు…