Monday, 30 November 2026

హైదరాబాద్

మన దేశంలోనే 2017 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కడియం శ్రీహరి అరెస్టు

జనగాం, వరంగల్‌: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నట్టు వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కస్టమ్స్‌ సుంకం పెంచబోమని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పెంపుపై అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ… అపఖ్యాతి పాలుకావడం తనకు ఇష్టం లేదని…

మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన

కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్‌ లో జరిగిన బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ‘నారీ…

శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగడం దారుణమన్నారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు…

ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి…

నలగాంపల్లిలో అగ్నిప్రమాదం

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి వద్ద ఉన్న కేఎస్‌ఎస్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ. 2కోట్ల విలువైన మామిడికాయలు, వాటిని నిల్వ ఉంచిన షెడ్లు కాలిపోయాయి. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది…

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది చిదంబరం

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని గతేడాది ఈ సమయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉందన్నారు. త్వరలోనే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు చిదంబరం గురువారం ప్రకటించారు.…

జియాఖాన్‌ ప్రియుడికి జ్యూడిషియల్‌ కస్టడీ

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె స్నేహితుడు , ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్‌ పంచోలీకి స్థానిక కోర్టు ఈ నెల 27 వరకు జ్యడీషియల్‌ కస్టడీ విదించింది. నిన్నటి వరకు…