Sunday, 22 November 2026

హైదరాబాద్

రాష్ట్రానికి వర్ష సూచన

విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విధర్బ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర, రాయలసీమ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కోనసాగుతుంది.…

రాజమండ్రిలో ఔషధ నియంత్రణ అధికారుల దాడులు

రాజమండ్రి : ఔషధ నియంత్రణ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దాడులు నిర్వహించారు. నెహ్రూనగర్‌లోని ఓ మిల్లులో రూ. లక్ష విలువైన ప్రభుత్వ మందులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అమెరికా సైనిక స్థావరానికి ‘రైసిన్‌’ టపా

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ డీసీలోని అనకోస్టియా -బోలింగ్‌ సైనిక స్థావరానికి ఇవాళ ఉదయం ‘రైసిన్‌’ విషం ఉన్న టపా వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, నెవడా డెమోక్రాటిక్‌ సెనేటర్‌ హ్యారీ రెయిండ్‌ తెలిపారు. స్థావరంలో రక్షణ నిఘా శాఖ…

ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయి: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయని , రెండుమూడు నెలల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. కరెంట్‌ ఖాతాలోటు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈ ఏడాది కరెంట్‌ ఖాతా లోటు…

పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: బొగ్గులకుంటలోని పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడి గోదాములోని 4 అంతస్తుల్లోకి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.

గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది

నల్లజెర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం చీపురుగూడెం రామాలయం భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఉదయం పోలీసుల సహాయంతో అధికారులు గుడిసెల తొలగింపు చేపట్టారు. అయితే ఈ చర్యను దళితులు అడ్డుకొని జాతీయ…

నేడు అతిరాత్రాన్ని సందర్శించిన డీజీపీ, సీబీఐ జేడీ

రంగారెడ్డి: అతిరాత్ర మహాయాగం రంగారెడ్డి ఇల్లా కీసరలో 12వ రోజుకు చేరింది. డీజీపీ దినేష్‌రెడ్డి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిరాత్రాన్ని ఈ ఉదయం సందర్శించారు. వారి వెంట జిల్లా అధికారులు, పోలీసులు ఉన్నారు.

నేడు ఐపీఎల్‌లో

కోల్‌కతా : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు జరగనుంది.

ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

రూ.20కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం అందజేస్తోంది

వాషింగ్టన్‌ : ముగ్గురిని కాల్చిచంపాడమే నేరంపై ఫిబ్రవరి నెలలో లాన్‌ఏంజిల్స్‌ పోలీసు శాఖకు చెందిన అధికారి క్రిస్టఫర్‌ డార్నర్‌ను పట్టుకునే క్రమంలో దినపత్రికనలను పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసు అధికారులు గాయపరిచారు. ఈ క్రమంలో వారి కారును…