Sunday, 22 November 2026

హైదరాబాద్

బంగారురథంపై వూరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు

తిరుపతి: తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో బంగారు రథంపై వూరేగుతూ భక్తులకు  దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరమలకు తరలివచ్చారు.

జిల్లాలో పర్యటనించానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి. కొత్తకోట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కొత్తకోటకు చేరుకుంటారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని, లబ్ధిదారులకు…

పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది

పోర్ట్‌మోరెన్‌బై: పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 6.4గా నమోదైందని యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాబహల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రాన్ని…

ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. మొత్తం నాలుగు యూనిట్లలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా రామారావు నియామకం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ( హెచ్‌ఎండీఏ) కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బి. రామారావుని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వేసవి సందర్భంగా నేటితో ముగిసిన విద్యాసంవత్సరం

హైదరాబాద్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు 2012-13 విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి జూన్‌ 11 వరకూ అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలను…

సెల్‌ఫోన్లు దుకాణంలో రూ.45 వేల విలువగల ఐఫోన్‌ చోరీ

హైదరాబాద్‌: సూటు, బూటు ధరించి సెల్‌ఫోన్ల దుకాణానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రూ.45 వేల విలువగల ఐఫోన్‌ను దొంగిలించారు. ఒకరు ఫోన్‌ కొనుగోలు కోసం వచ్చినట్లు నటిస్తూ సిబ్బందితో చర్చలు జరుపుతుండగా మరో వ్యక్తి షాపు యాజమాని,…

రాయలసీమలో సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: రాయలసీమ జిల్లాల మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు సాధారణ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాలల్లో 41, అనంతపురం, కడపలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కాషాయగూడ, కాప్రా, ఏఎన్‌రావు నగర్‌, కీసర, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌లలో ఈదురుగాలులతో…

చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు కలిసిన శాసనసభ్యులు

చంచల్‌గూడ(హైదరాబాద్‌): అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిని ర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యులు మంగళవారం కలిశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌లు…