Sunday, 22 November 2026

హైదరాబాద్

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఐపీల్‌-6లో నేటి మ్యాచ్‌లు

న్యూఢిల్లీ; ఐపీల్‌ -6 భాగంగా ఇవాళ బెంగళూరు జట్టు పుణె వారియరర్స్‌ మధ్య  బెంగళూరులో సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.పంజాబ్‌ ఎలెవన్‌ కింగ్స్‌ జట్టుతో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్లు తలపడనున్నాయి.

బెంగుళూర్‌ పేలుళ్లలో ముగ్గురు అరెస్టు

చెన్నై; బెంగుళూర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు కేసులో సిట్‌ అధికారులు పురోగతి సాధించారు.ఈ పేలుడు ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.వీరే పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు.చెన్నై పోలీసుల సాయంతో పీర్‌…

టీఆర్‌ఎస్‌అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌;టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 24,25తేదీల్లో నామినేషన్లు ఉపసంహరణకు అవకాశమిస్తున్నామని తెలిపారు.అనంతరం…

విషపు ఇంజెక్షన్‌ తీసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు తమ్ముడితో గొడవపడి మధుప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సౌర విద్యుత్‌ కొనుగోలు ధర ఖరారు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కొనుగోలు ధరను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఈ ఉదయం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉపసంఘం భేటీ అయి సౌర విద్యుత్‌ కొనుగోలు ధర, బిడ్ల ఖరారుపై చర్చించింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే…

అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోశయ్య

విజయవాడ : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య సంఘం సమావేశాలకు ముఖ్య అతిథిగా రోశయ్య హాజరయ్యారు. వేదికపై రోశయ్య అస్వస్థతకు గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.…

రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయబేధాలు స్వల్పమైనవే

వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీకాకుళం: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు స్వల్పమైన వేనని వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ ముకుందశర్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో…

సూట్‌కేసులో ఉన్న మృతదేహాం

హైదరాబాద్‌: నగర శివార్‌లలోని నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో సూట్‌కేసులో ఉంచిన ఓ మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృత దేహాన్ని సూట్‌కేసులో ఉంచి ఉక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర ఆధారాల…

మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్‌ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు 1000 మెగావాట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది.