Thursday, 19 November 2026

హైదరాబాద్

సీలేరు నదిలో జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి

విశాఖ: సీలేరు నదిలో ప్రమాదవశాత్తు జారిపడి జెన్‌కో ఉద్యోగి మృతి చెందాడు. జెన్‌కోలో పనిచేస్తున్న మేకా శ్రీనివాస్‌ ఈ ఉదయం నదిని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.…

హైదరాబాద్‌ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర న్యాయసేవా సంస్థ నగరంలోని సివిల్‌కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు…

బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఆసీన్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపధ్యంలో పోలీసులు ఉప్పల్‌ స్టేడియం వద్ద…

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో భూకంపం

న్యూఢిల్లీ: భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. కరీంగంజ్‌లోని సైల్హెత్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది.

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరు చిన్నారుల మృతి

ఆదిలాబాద్‌ : జైనాథ్‌ మండలం పెండెల్‌వాడలో ఇసుక ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ట్రాక్టర్‌…

రేపటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి వెంట రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్‌ రంజన్‌ చౌదురి, పలువురు సీనియర్‌…

హైదరాబాద్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం

హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయసేవా సంస్థ హైదరాబాద్‌లోని సివిల్‌ కోర్టు ఇవరణలో ఏర్పాటు చేసన మధ్యవర్తిత్వ కేంద్రంను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ ప్రారంభించనున్నారు. మధ్యవర్తిత్వంపై చైతన్యం తీసుకొచ్చి వివాదాలను పరిష్కరించుకునే దిశగా ఈ కేంద్రం…

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. ఈ ఉదయం యార్డు నుంచి స్టేషన్‌కు తరలిస్తుండగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా సకింద్రాబాద్‌ – విశాఖ…

రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ

హుస్నాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌, జూనియర్‌ లైన్‌మన్‌ సంపత్‌ రైతు వద్ద రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ…

చైనా బొగ్గుగనిలో అగ్ని ప్రమాదం..11 మంది మృతి

బీజింగ్‌ :ఉత్తర చైనాలోని జాంగ్జియాకౌ పట్టణంలోని బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. గనిలోని ఎయిర్‌ కంప్రెషర్‌కు మంటలు అంటుకొని భారీగా వ్యాపించడంతో ఈ…