Wednesday, 11 November 2026

వరంగల్

ఏసీబీ వలలో భూసర్వే అధికారి

వరంగల్‌ : కాజీపేటలోని భూసర్వే కార్యాలయంలోపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా ఎస్‌డీఎం సాయిప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పంచాయతీ సెక్రటరీ పరీక్షకు ఉచిత శిక్షణ

వరంగల్‌,జనవరి24: పంచాయతీ సెక్రటరీ విఎవో, విఆర్‌వో పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఉచితంగా…

మేడారంలో ఆదివాసీ భవన్నిర్మించాలి

వరంగల్‌,జనవరి24: ఆదివాసీల కోసం మేడారం జాతర ప్రాంగణంలో ఆదివాసీ భవన్‌ను నిర్మించాలని పలు ఆదివాసీ సంఘాలు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మేడారంలో గిరిజన యూనివర్సిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ జాతుల్లో ఒకటైన కోయ…

సకాలంలో రుణం చెల్లిస్తే బకాయిలో రాయితీ

వరంగల్‌,జనవరి20: జిల్లాలో 700 మంది రైతులు సుమారు  65 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణాలు పొంది బకాయి దారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువుగా 5 లక్షల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నవారేనని చెప్పారు. వీరు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు…

దేవాలయ భూములు స్వాధీనం చేసుకోవాలి

వరంగల్‌,జనవరి16: తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల భూములు 12 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వీటిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ వైష్ణవ అర్చక ఐకాస ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ఎండోమెంట్‌ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.…

వ్యాగన్‌ పరిశ్ర పనులు చేపట్టాలి

వరంగల్‌,జనవరి16: కాజీపేటలో నిర్మించాలనుకున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్తాపన చేసి పనులు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కోరారు. ఈ మేరకు వారు కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గేను కలసి వినతి…

అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం

వరంగల్‌: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముందుకొచ్చాడు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాను పుట్టిన రోజు జరుపుకోకుండా తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని…

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌:పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో జన్నారావు పేట మండలం పాపయ్య పేటలో విషాదం చోటు చేసుకుంది.తమ కూతురు ఆత్మ హత్యకు ఈవ్‌ టీజర్ల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎనుమాముల మార్కెట్‌లో హమాలీల ఆందోళన

వరంగల్‌ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని హమాలీలు డిమాండ్‌ చేస్తున్నారు. హమాలీల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.

నిమ్స్‌ భవనంపై నుంచి దూకి బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆస్పత్రిలో విషాద వాతావరణం నెలకొంది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలుడు నిమ్స్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.