Saturday, 21 November 2026

జాతీయం

మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌

ముంబయి: కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరల విధానంతో స్టాక్‌మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్‌ నమోదైంది. సెన్సెక్స్‌ 332 పాయింట్లకుపైగా, నిఫ్టీ 98 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడిన రూపాయి

ముంబయి: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 59.88కి చేరింది. మరోవైపు కేంద్రం ప్రకటించిన గ్యాస్‌ ధరలు విధానంతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.

డెహ్రాడూన్‌ వెళ్లనున్న సుశీల్‌కుమార్‌ షిండే

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ను ఇంకా వరద ముప్పు వీడలేదు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వరద సహాయక చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌…

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 270 పాయింట్లకు పైగా లాభపడింది. 85 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.

జులై 2, 3 తేదీల్లో విడుదలయ్యేనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ఢిల్లీ : జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం కన్పిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. జులై 2,3 తేదీల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే…

ఉద్ధప్‌ ఠాక్రేతో మోడీ భేటీ

ముంబయి : ముంబయి పర్యటనలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధప్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. మోడీ ఠాక్రే నివాసానికి వెళ్లి కలిశారు. మోడీ గుజరాత్‌ దాటి బయటకు…

పెరుగుతోన్న గోదావరి నీటి మట్టం

రాజమండ్రి: గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 8.9 అడుగులకు పైగా నీరు చేరింది. సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వరదనీరు…

ముంబయి చేరుకున్న మనీషా కోయిరాలా

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి మనీషా కోయిరాల బుధవారం సాయంత్రం ముంబయి చేరుకున్నారు. గత ఏడు నెలలుగా ఆమె అమెరికాలో ఉండి క్యాన్సర్‌కి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ముంబయి చేరుకున్న ఆమె నేరుగా వెర్సోవాలోని తన…

ఆజాద్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి ఎస్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి పలువురు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతున్నారు.