Saturday, 21 November 2026

జాతీయం

సుప్రీంలో రాన్‌ బాక్సీపై పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సుప్రీకోర్టు రాన్‌బాక్సీ మందుల కంపెనీకి ఊరట లభించింది. నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆ కంపెనీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: రాగల 24గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం… వాయువ్య బంగాళాఖాతం, ఒడిశాలను అనుకుని స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనికితోడు…

బాధితులకు పర్యాటక శాఖ రూ. కోటి సాయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పలు ప్రభుత్వ శాఖలు సాయం ప్రకటించాయి. ఈ పేపథ్యంలోనే కేంద్ర పర్యాటక శాఖ కూడా తాను సైతం అంటూ బాధితులకు రూ. కోటి సాయం అందజేసింది. ఈ మేరక ఆ శాఖ నుంచి…

కూలిపోయిన మిగ్‌-29 యుద్ధ విమానం

గుజరాత్‌ : జామ్‌నగర్‌లోని ఓ గ్రామం వద్ద మిగ్‌-29 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

క్రికెటర్లకు బీసీసీఐ రూ.కోటి నజరానా

ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా ప్రకటించింది.

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య శిబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు వైద్యం సాయం అందించేందుకువెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి అనూహ్యంగా చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహణకు రెసిడెంట్‌ కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు…

యాత్రికులకు రూ. 2వేలు చొప్పున అందించిన అధికారులు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీలో చేరి ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు రూ. 2వేల చొప్పున అధికారులు సాయం అందించారు. దుస్తులు, ఇతర సామాగ్రి కోసం యాత్రికులకు రూ. 2వేలు…

ఉత్తరాఖండ్‌లోనే మృతుల అంత్యక్రియలు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ తీర్థయాత్రలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారలు తెలిపారు. దహన సంస్కారం కోసం సుమారు…

విశాఖలో ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన

సీఎం విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.