Wednesday, 25 November 2026

సీమాంధ్ర

మే 14 నుంచి నంది నాటకోత్సవాలు

రాజమండ్రి : రాజమండ్రి నగరంలో ఆంధ్రప్రదేశ్‌ నంది నాటకోత్సవాలు మే నెల 14 నుంచి 29వతేదీ వరకు జరగనున్నాయి. ఈ నాటకోత్సవాల్లో రెండు వేలమంది కళాకారులతో 88 నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. నంది నాటకోత్సవాలను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించేందుకు…

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు : ఇద్దరికి గాయాలు

అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం దాదులూరు దగ్గర ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన

నెల్లూరు: అలహాబాద్‌లో ఓ న్యాయవాదిని కానిస్టేబుల్‌ కాల్చిచంపిన సంఘటనకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా కోర్టు ఎదుట విధులు బహిష్కరించిన న్యాయవాదులు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.…

తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న నెల్లూరు కలెక్టర్‌

నెల్లూరు : నెల్లూరు జిల్లా కలెక్టర్‌ జానికి ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ఉదయం ఆమె అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని…

రూ.1,13049 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌

ప్రణాళిక వ్యయం రూ.34,412 కోట్లు హైదరాబాద్‌, మార్చి 12 : 2015-16 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,13049 కోట్లు అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఏపీ శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ…

వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఆందోళన

గుంటూరు, (మార్చి, 11): ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో సీపీఐ పార్టీ ఆందోళన చేపట్టింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. విభజన అనంతరం ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న…

గన్నవరంలో ఎస్సీ హాస్టల్‌ విద్యార్థి ఆత్మహత్య

విజయవాడ, మార్చి 11: గన్నవరం మండలం దావాజిగూడెంలోని ఎస్సీ హాస్టల్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన దావాజిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

నెల్లూరు, (మార్చి11): నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు సమీపంలో కారు వేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రికి…

విష్ణునివాసంలో కాంట్రాక్టు ఉద్యోగి మృతి

తిరుపతి, (మార్చి11): పట్టణంలోని విష్ణునివాసంలో గుండెపోటుతో కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్‌ బుధవారం మృతి చెందారు. విధినిర్వహణలోనే వెంకటేశ్‌ మృతి చెందాడని, అతని కుటుంబాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకోవాలని కోరుతూ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేశారు.