Tuesday, 24 November 2026

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, హైకోర్టు న్యాయమూర్తిలు జస్టిన్‌ ఎస్‌.వి. రమణ…

విద్య, వైద్య కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయం: నారాయణ

తిరుపతి,(జనంసాక్షి): సమాజంలో విద్య వైద్య రంగాలు కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సదస్సు తిరుపతిలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర నుంచి ప్రముఖ…

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): కొయ్యూరు అటవీప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పులలో మహిళ మావోయిస్టు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు.

అనుయాయులపై వైకాపా కార్యకర్తల దాడి

ముసునూరు: కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేలుపుచర్లలో కాంగ్రెస్‌ అనుయాయులపై శుక్రవారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సుచేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడడంతో అతని ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన మరో…

రవిశంకర్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులు

తూర్పుగోదావరి: అనంద్‌ రీజెన్సీ యజమాని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రమాదవశాత్తు మృతి చెంది ఉండవచ్చని అయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 8న అదృశ్యమైన రవిశంకర్‌ ప్రసాద్‌ ఐ. పోలవరం మండలం గోకులలంక రేవులో శవమైతేలిన విషయం తెలిసిందే. అయితే…

ఉత్తరాంధ్రపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

విశాఖ: ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కోసం రోడ్‌మ్యాప్‌ అంశంపై విశాఖపట్నంలోని పార్కు హోటల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ద్రోణం రాజు శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయులు శివశంకర్‌రావు, వరదారెడ్డి, ఆర్‌.వి. రామారావు,…

ఎరువుల వ్యాపారి ఇంట్లో పేలుడు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భావనారుషి నగర్‌లో నివాసం ఉంటున్న ఎరువులు, పురుగు మందుల వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నివాస గృహంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఇంటి ముందు భాగంలో ఉన్న సుమారు…

నామినేషన్‌ పత్రాలను అపహరించిన యువకులు

పెళ్లకూరు, (జనంసాక్షి): నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేషన్‌ కేంద్రం వద్ద వైకాప అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పత్రాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో…

గూడ్స్‌ రైల్లో మంటలు

ఒంగోలు,(జనంసాక్షి): ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్‌ రైల్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో స్టేషన్‌ అధికారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటీన సంఘటన…

మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపివేసిన అధికారులు

విజయవాడ, (జనంసాక్షి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ షీట్‌ మ్యాట్రిక్స్‌లో సీట్లు అందుబాటులో లేవని ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులు అందోళనకు దిగారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు.