Thursday, 12 November 2026

ఖమ్మం

యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టరు

ఖమ్మం సంక్షేమం: జిల్లా యువజాన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను కలెక్టరు శ్రీనివాసశ్రీనరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరులో నిర్వహించే…

భద్రాచలం వద్ద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టిన గోదావరి నది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48.9 అడుగులకు తగ్గింది.

నగరపాలక సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తున్న సీపీఐ

ఖమ్మం, కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శులు సలాం మాట్లాడుతూ నగరంలో పలు ప్రాంతాల్లో…

ఐటీసీ పేపర్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఖమ్మం,(జనంసాక్షి): బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్‌ మిల్లులో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని డీజిల్‌ జనరేటర్‌ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.

తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత

ఖమ్మం,(జనంసాక్షి): వరదల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువైంది. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేసి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ యూనిట్‌లో 15 రోజుల పాటు, 11 యూనిట్‌లో 30 రోజుల…

పందిళ్లపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

ఖమ్మం,(జనంసాక్షి): చింతకాని మండలం పందిళ్లపల్లిలో 144 సెక్షన్‌ కొనసాగుతుంది. కాంగ్రస్‌ నేతలు సీపీఎం నేత శ్రీనివాసరావును హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ 300 మంది పోలీసులను మోహరించారు. ఖమ్మం నుంచి శ్రీనివాసరావును మృతదేహంతో పందిళ్లపల్లికి…

స్థానికేతరులపై స్థానికుల దాడి

ఖమ్మం,(జనంసాక్షి): ఓటు వేయడానికి వచ్చిన స్థానికేతరులపై స్ధానికులు దాడి చేశారు. ఈ ఘటన ముత్తగూడెంలో చోటు చేసుకుంది. 30 మంది స్థానికేతరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.

ఓట్లు గల్లంతయ్యాయని సిబ్బందిపై దాడి

ఖమ్మం,(జనంసాక్షి):కొణిజెర్ల మండలంలో పల్లిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

సుబ్లేడులో వార్డులకు ఎన్నికలు వాయిదా

ఖమ్మం,(జనంసాక్షి): తిరుమాయపాలెం మండలం సుబ్లేడులో 6,9 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుబ్లేడులో 6,9 వార్డుల సభ్యులు పేర్లు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు వార్డులకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని…