Thursday, 12 November 2026

మెదక్

యూరియా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

దౌల్తాబాద్‌ గ్రామీణం: గురువారం స్థానిక వ్యవసాయ పరపతి సంఘానికి కేవలం 300 బస్తాల యూరియా వచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు వీటి కోసం ఎగబడ్డారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా…

సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని జహిరాబాద్‌ మండలం మాల్చల్‌మడలో దొంగలు బీభత్సవం సృష్టించారు. సిండికేట్‌ బ్యాంకులో చొరబడ్డ దొంగలు నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని సిండికేట్‌ బ్యాంకుల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న…

బంగారం దుకాణంలో భారీ చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఏసీబీకి చిక్కిన శివంపేట వీఆర్వో

మెదక్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ శివంపేట వీఆర్వో టి. డాకయ్య ఏసీబీ అధికారలకు చిక్కాడు. సుందర్‌ అనే రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డాకయ్యను పట్టుకున్నారు.

సూది మందు వికటించి వ్యక్తి మృతి

మెదక్‌,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.

రేవంత్‌ ఓ పిల్లకాకి: గట్టు రామచంద్రరావు

మెదక్‌,(జనంసాక్షి): టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిల్ల కాకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు విమర్శించారు. టీడీపీ కాకిగోలకు వైఎస్‌ఆర్‌ సీపీ బెదరదన్నారు. కాంగ్రెస్‌ 2 తలల విషనాగు అని పేర్కొన్నారు. రాజకీయ ప్రాధాన్యత…

గ్రామస్తుల రాస్తారోకో: పోలీసుల లాఠీచార్జ్‌

మెదక్‌,(జనంసాక్షి): చేగుంటను నగర పంచాయితీగా మార్చొద్దంటూ వడియారం హైవేపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోకు దిగిన గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

గజ్వేల్‌లో భార్యను నరికి చంపిన భర్త

మెదక్‌,(జనంసాక్షి): గజ్వేల్‌లోని బీడీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని భర్త దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

మెదక్‌లో తెలంగాణవాదుల ముందస్తు అరెస్టు

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటన సందర్భంగా పలువురు తెలంగాణ వాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ జోగిపేటలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పర్యటిస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు,…

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.