Thursday, 12 November 2026

మెదక్

నేడు ఆదర్శ ఉపాధ్యాయుల సదస్సు

సంగారెడ్డి మున్సిపాలిటి: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు ఈనెల 8న హైదరాబాద్‌లోని దోమలగూడ యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మారెడ్డి ,ప్రధాన కార్యదర్శి బి.సాయిలు తెలిపారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్డొనాలని కోరారు.

కారు,ట్రాలీ ఆటో ఢీ : ఒకరి మృతి

కొండపాక (మెదక్‌) : మెదక్‌ జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ రహదారిపై ట్రాలీ ఆటో ,కారు ఢీకోన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్‌ జిల్లా నెంబర్‌తో ఉన్న కారు హైదరాబాద్‌…

ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ఆగదు : మంత్రి గీతారెడ్డి

మెదక్‌ : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదని మంత్రి గీతారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ ,రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని స్పష్టం ఆమె స్పష్టం చేశారు.

విద్యుత్‌ అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు

మెదక్‌,(జనంసాక్షి): పుల్కట్‌ మండలం చౌటూరులో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ విద్యుత్‌ అధికారులను గ్రామస్థులు నిర్భంధించారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ కోతలు విధిస్తూనే బిల్లులు వసూలు చేయడం సబబు…

50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌,(జనంసాక్షి): నారాయణఖేడ్‌ మండలం గోప్యానాయక్‌ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండపాక,(జనంసాక్షి): మెదక్‌జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం (55) తీవ్రంగా గాయపడి సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు…

గంజాయి సాగు చేస్తున్న రైతులను పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

మనూరు: మనూరు మండలం ఎనకపల్లి శివారులో ఐదెకరాల్లో సాగవుతున్న 4కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లతో దున్నేసి తగుల బెట్టారు. గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించాల్సి ఉంది.

యూరియా కోసం రాస్తారోకో చేపట్టిన రైతులు

చేగుంట : యూరియా కొరత తీర్చాలంటూ చేగుంటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత కొద్దిరోజులుగా చేగుంటలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో సోమవారం వారు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన…

ఇంటిలో ఉరివేసుకుని వివాహితి మృతి

మిరుదొడ్డి: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో తిప్పరబోయిన స్వరూప (24) అనే వివాహిత అదివారం రాత్రి 7గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. తన మరణానికి ఎవరూ కారకులు కారని ఆమె లేఖ రాసి పెట్టి ఉరి…

డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి

జిన్నారం: జిన్నారం మండలం కొర్లుకుంటలో డెంగీ వ్యాధితో మహిళ మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన లక్ష్మీ (40) ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.