Sunday, 29 November 2026

వార్తలు

స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు

రాజమండ్రి,(జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్వతంత్ర గ్రూపుపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ, స్వతంత్ర ఆస్పత్రులపై ఏక కాలంలో అధికారులు దాడులు చేశారు. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు గన్ని భాస్కరరావు  నేతృత్వంలో…

ప్రాణత్యాగాలకైనా సిద్దమే: కోమటిరెడ్డి

నల్గొండ: తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కిరణ్‌, బొత్స సత్య నారాయణ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోతే…

కేంద్రహోంశాఖ అధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన, భద్రతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఆదర్శ రైతుపై ప్రత్యర్థుల దాడి

వరంగల్‌: జిల్లాలోని మర్రిపెడ మండలం అనేపురం గ్రామంలో ఆదర్శ రైతుపై ప్రత్యర్థులు దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రైతును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా సర్పంచి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నందుకే…

2 జీ కేసులో అనిల్‌ అంబానీకి చుక్కెదురు

ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కుంభకోణం కేసులో రిలయన్స్‌ అనిల్‌ అంబానీకి చుక్కెదురైంది. అనిల్‌ అంబానీకి కోర్టు నోటీసులపై రిలయన్స్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.  సాక్షిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

సమైక్యాంధ్ర కోసం వీరాశివారెడ్డి రాజీనామా

కడప,(జనంసాక్షి): సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోసారి డ్రామాలకు తెరలేపారు. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి కమలాపురం ఎమ్మెల్యే శివారెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్లు తెలిపింది. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వీరాశివారెడ్డి ప్రకటించాడు.

జానారెడ్డి నివాసంలో టీ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఢిల్లీ వెళ్లే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ఆ ఇద్దరి వివరాలు తెలిపితే రూ. 5లక్షల బహుమతి

ఢిల్లీ: గుజరాత్‌లో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఇష్రత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆమెతో పాటు కాల్పుల్లో మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించి వివరాలు ఏమైనా తెలియజేస్తే రూ. 5లక్షలు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది. సీబీఐ ఈ మేరకు…

సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని జహిరాబాద్‌ మండలం మాల్చల్‌మడలో దొంగలు బీభత్సవం సృష్టించారు. సిండికేట్‌ బ్యాంకులో చొరబడ్డ దొంగలు నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని సిండికేట్‌ బ్యాంకుల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న…

రాజీనామా చేస్తామని చెప్పలేదు: శైలజానాథ్‌

అనంతపురం: సమైక్యవాదాన్ని మరోసారి బలంగా వినిపించేందుకే ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌ శైలజానాథ్‌ తెలిపారు. మంత్రులెవరూ రాజీనామా చేస్తామని చెప్పలేదని, కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉంటామని మాత్రమే అన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా…