Sunday, 29 November 2026

వార్తలు

రాజీనామాలపై స్వరం మార్చిన సీమాంధ్ర మంత్రులు

హైదరాబాద్‌: సీమాంధ్ర మంత్రులు విభజనపై తమ స్వరం మార్చారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తామన్న వార్తలపై మంత్రులు టీజీ వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది తమ ప్రధాన డిమాండన్నారు. తమ…

అమ్మహస్తంపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో అమ్మహస్తం పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

48గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

వాణిజ్య పన్నులశాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ సాయినగర్‌లో నివసిస్తున్న వాణిజ్యపన్నులశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ రూ. 5కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు: వెంకయ్యనాయుడు

బారకాన్‌, నెల్లూరు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్నినా అవి వృథాయేనని భాజపా జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

బాలనేరస్థుడిపై తీర్పు 5వ తేదీకి వాయిదా

ఢిల్లీ: ఢిల్లీ అత్యాచారం ఘటనలో బాల నేరస్థుడిపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్థుడు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఆగస్టు 21న ప్రారంభంకానున్న శ్రావణపౌర్ణమి వ్రతాలు

విశాఖపట్నం, ఎం.వి.పి. కాలనీ:తితిదే, డిపిపి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో 1130 దేవాలయాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మప్రచార మండలి జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి ఆలయ శోభ పేరిట…

రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్న అనిల్‌ అంబానీ

ఢిల్లీ: రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 2జీ కేసులో రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు ప్రాసిక్యూషన్‌ సాక్షిగా హాజరుకానున్నారు. ట్రయల్‌ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రిలయన్స్‌ టెలికాం లిమిటెడ్‌ దరఖాస్తును సుప్రీంకోర్టు గురువారం అత్యవసరంగా…

నక్సలైట్లు మా సోదరులే అని పలికిన బలరాం నాయక్‌

వరంగల్‌: నక్సలైట్లు తమ సోదరులేనని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ అన్నారు. వ్యూహ బృందంలో తెలంగాణకు అనుకూలంగా 60 శాతం నిర్ణయం జరిగిందని వెల్లడించారు. రాయల తెలంగాణ లేదా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అంశాన్ని తేల్చేందుకే 90 రోజులు గడువు…