Saturday, 28 November 2026

వార్తలు

108 సిబ్బంది సమ్మెపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: 108 సిబ్బంది సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధికారులతో సమీక్షనిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సామంత్రంలోపు 400 మంది సిబ్బందిని అత్యవసర ప్రాతిపతికన నియమిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. తెలంగాణ పై మరోసారి అఖిలపక్షం, రెండో ఎస్సార్సీ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

రోడ్డుపై కూలిన వృక్షం: స్తంబించిన ట్రాపిక్‌

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని బాగిరిసి పేట క్రాన్‌ రోడ్డు వద్ద పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు కూలింది. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు ప్రక్కన ఉన్న చెట్లు కూలడంతో పరకాల-భూపాలపల్లి…

బెల్లంపల్లి ఏరియాలో భారీవర్షం

బెల్లంపల్లి: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేమనపల్లి మండలంలోని రాచర్లపల్లి, నీల్వాయి, జాజులపేట, చల్లంపల్లి, తుంకుటం, దత్నాపూర్‌ గ్రామాలు జలమయమయ్యాయి. ప్రాణహితనది పొంగి పొర్లుతుండటంతో వేమనపల్లి మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో…

తీగలవర్రె వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గంలోని జెజ్జూరు. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బెజ్జూర్‌-పెంచికల పేట ప్రధాన రహదారిలోని తీగలమర్రి వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సుడ్రైవర్‌, కండర్టర్‌ బస్సుఎక్కి రక్షంచాలని కోరుతున్నారు. బస్సులో…

అమర్‌నాథ్‌యాత్రకు తాతాల్రిక విరామం

శ్రీనగర్‌: కాశ్మీర్‌ లోయలోని ప్రముఖ పట్టణాలలో విధించిన కర్ఫ్యూ కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గురువారం రాంబాన్‌లో సరిహద్దు రక్షణ దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించారు. ఇందుకు నిరసనగా కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఈ…

విదేశీ మారక విపణి ఆందోళన కలిగిస్తోంది: మన్మోహన్‌

న్యూఢిల్లీ: అస్థిరమైన విదేశీ మారక విపణి ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. బంగారం, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గించిల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు దీర్ఘకాలిక రుణాల వడ్డీరేట్ల పెంపుదలకు సంకేతం కాదన్నారు. కరెంటు…

సబిత, ధర్మాన కస్టడీ పిటిషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దర్మాన ప్రసాదరావుల జ్యుడీషియల్‌ కస్టడీ పిటిషన్‌ పై విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25కు వాయిదా వేసింది.

ప్రమాదస్థాయిలో హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం

హైదరాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. జంటనగరాల్లో పలు ప్రాంతాల నుంచి భారీగా నీరు హుస్సేన్‌ సాగర్‌లో కలుస్తుండడటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరింత నీరు సాగర్‌ కలిస్తే తమ కాలనీలు నీట…

వరదలో చిక్కుకున్న ఆర్టీసీబస్సు

ఆదిలాబాద్‌: జిల్లాలో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. బెజ్జూరు మండలం తీగలపల్లి వాగులో ఈ ప్రమాదంలో జరిగింది. ఆర్టీసీ బస్సులో 60 మంది ప్రయానికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు ప్రయానిస్తున్నారు.