Wednesday, 25 November 2026

వార్తలు

భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ఫీజులో కోత

కింగ్‌స్టన్‌,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ తెలిపింది. జట్టు సారథి విరాట్‌ కోహ్లి మ్యాఛ్‌ ఫీజులో 20 శాతం, జట్టు…

ముగిసిన టీ జేఏసీ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ సమావేశం ముగిసింది. ఇవాళ హస్తినలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పన్నెండు జాతీయ పార్టీల నేతలు, ఏడుగురు ఎంపీలు హాజరయ్యారు.…

సింహగర్జనకు మద్దతు తెలిపిన స్థానిక నేతలు

హైదరాబాద్‌ : స్థానిక ఇందిరాపార్కులో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ వాసులు చేపట్టిన 52 గంటల సింహగర్జన కార్యక్రమానికి ఆ ప్రాంతం నుంచి వచ్చిన స్థానిక నేతలు దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు…

ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ అయింది. ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అద్వానీ, వెంకయ్యనాయుడు, పార్టీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుంది.

ఏఆర్‌ రహ్మాన్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ ‘రిఫ్లెక్షన్స్‌’

చెన్నై: సంగీత దర్శకుడు, గాయుకుడు ఏ ఆర్‌ రహ్మాన్‌ ‘రిఫ్లెక్షన్స్‌’ పేరుతో ఒక కాఫీ టేబుల్‌ బుక్‌ను అవిష్కరించారు. రచయిత టి.సెల్వకుమార్‌ ఈ పుస్తకంలో మెజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌గా పేరొందిన రహ్మాన్‌ జీవనయానం గురించి విపులంగా రాశారు. ఇతర…

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా నియమితులైన కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌ : ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రేవుల ప్రకాశ్‌రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ప్రజాపద్దుల సంఘం పాత సభ్యులందరూ యథావిధిగా కొనసాగుతారు.

రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముస్లింల పవిత్ర రంజాన్‌ పండగపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ఆయన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై రంజాన్‌ పండుగ కోసం ఏర్పాట్లపై చర్చించారు.

పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న రూ. 450కోట్ల భవింతి

ముంబయి: ఒకప్పటి వాట్సన్స్‌ హోటెల్‌…. ఇప్పటి ఎస్ల్పనేడ్‌ మ్యాన్షన్‌….. వయసు రెండు వందల ఏళ్లు, ఖరీదు రూ. 450 కోట్ల పైమాటే. దేశంలో ఉన్న ఒకే ఒక్క క్యాస్ట్‌ ఐరన్‌ నిర్మాణం దక్షిణ ముంబయిలో ఉన్న ఈ హెరిటేజ్‌…

మౌస్‌ సృష్టికర్త ఎంగల్‌బార్ట్‌ మృతి

న్యూయార్క్‌,(జనంసాక్షి): కంప్యూటర్‌ మౌస్‌ను కనుగొన్న డగ్లస్‌ ఎంగల్‌బార్ట్‌ (88) కన్నుమూశారు. కంప్యూటర్‌ రంగంలో మౌస్‌ ఆవిష్కరణ అనేక విప్లవాత్మక మార్పులకు దారితీసింది. కంప్యూటర్‌ రంగంలో కీలకమార్పులకు నాందిపలికిన మౌస్‌ను 1963లో డగ్లస్‌ తయారుచేశారు. ఈ మౌస్‌ను మరింత ఆధునీకరించి…

మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగుల దాడి

నెల్లూరు,(జనంసాక్షి): మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగులు దాడి చేశారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కత్తితో పొడిచి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గంటి ప్రసాద్‌ను…