Saturday, 21 November 2026

వార్తలు

‘నాట్స్‌’ సాహిత్య పోటీల విజేతలు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) జులై 4 నుంచి 6వ తేదీ వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న మూడవ ద్వైవార్షిక సందర్భంగా ఏర్సాటు చేసిన సాహిత్య పోటీల విజేతల వివరాలను ఆ సంస్థ ప్రచార…

అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకుంటారు : రాజ్‌నాథ్‌

ఢిల్లీ : అద్వానీ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని, బాధ్యతల్లో కొనసాగుతారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని ఆయన తెలిపారు. అద్వానీతో సుదీర్ఘ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ

గాందీనగర్‌ : భాజపాలో కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని అక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నార్ణయం తీసుకోవడంపై ఆయన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

భారత్‌ అక్ష్యం 234

లండన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. విండీస్‌ జట్టులో ఛార్లెస్‌ 60, డీఎం బ్రావో 35,…

పీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తిచేసుకున్న బొత్స

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ రోజు బొత్స సత్యనారాయణకు గాంధీభవన్‌లో అభినందనలు తెలిపారు. 2011 జూన్‌ 7న పీసీసీ అధ్యక్షునిగా నియమితులైన జూన్‌ 11న బాధ్యతలు స్వీకరించారు.

అద్వానీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మోడీ

గాంధీనగర్‌: భాజపా కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని లక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నిర్ణయం తీసుకోవడం పై ఆయన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

కుక్కకాటుతో బాలుడి మృతి

కుక్కకాటుతో బాలుడి మృతి సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కీసరలో క్కుకాటులో ఒక బాలుడు మృతి చెందిన సంఘటనను లోకా యుక్త  సుమోటోగా స్వీకరించింది. కుక్క కాటు మృతులకు సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ ఆయా జిల్లాల…

ఐపీఎస్‌ అధికారి పాండే పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ,(జనంసాక్షి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పి.పి. పాండే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇష్రత్‌ జహాన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తనపై ఎఫ్‌ఆర్‌ కొట్టివేయాలని పాండే పిటిషన్‌ దాఖలు చేశారు.

కరువు భత్యం జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం చెల్లింపునకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకుగాను జీవో నెం.136 ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.