Friday, 20 November 2026

వార్తలు

మళ్లీ ఆడపిల్లే పుట్టిందని…

హైదరాబాద్‌ : మళ్లీ ఆడపిల్లే పుట్టిందని ఆ శిశువును వదిలించుకోజూశారు తల్లీకూతుళ్లు, పుట్టి నాలుగు రోజులు గడకముందే పసిబిడ్డను నాలాలో పడేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించిన పసిబిడ్డ అమ్మమ్మను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. మీర్‌పేటకు చెందిన గోవిందమ్మ…

విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం

ప్రకావం జిల్లా : ఒంగోలు మంగమూరు రోడ్డులోని 133 కేవీ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉపకేంద్రంలో పక్కన పడేసిన తీగలు ఎండలకు కాలి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

రాయ్‌పూర్‌, జనంసాక్షి: ఛత్లీస్‌గఢ్‌ నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడిన రాయపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పరార్శించారు. బస్తర్‌ జిల్లాలోని దర్భాషూట్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల…

వడదెబ్బకు 92 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా వివరాలు. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో 10 మంది చొప్పున, నల్గొండ,…

అగ్నిప్రమాదంలో 30 ఇళ్లు దగ్ధం

రాజమండ్రి, జనంసాక్షి: కె. గంగవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 30 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. రూ. 60 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను…

మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్టు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

పెళ్లిపీటల మీద నుంచి పరారైన వరుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడవాల్సిన వరుడు పెళ్లి పీటల మీద నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బోరబండలో చోటు చేసుకుంది. రూ. 5లక్షల కట్నం తీసుకుని వరుడు నరేష్‌ ఉడాయించాడు. పెళ్లికూతురు…

వీసీ శుక్లా పరిస్థితి విషమం

ఢిల్లీ : నిన్న మావోయిస్టుల దాడిలో గాయపడిన కాంగ్రెస్‌ నేత విద్యా చరణ్‌ శుక్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. 84 ఏళ్ల శుక్లాను గుర్‌గావ్‌లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన వూపిరితిత్తులు, కాలేయం, పొత్తికడుపుల్లో…

లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడపజిల్లా: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం దేశెట్టిపల్లి వద్ద రూ. 20 లక్షల విలువైన 185 ఎర్రచందనం దుంగలు ఉన్న లారీని అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే మండలంలో ముస్తూరు వద్ద రూ. 10 లక్షల విలువైన…

జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌ : జూన్‌ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 9 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీన్ని పంపణీ…