Thursday, 19 November 2026

వార్తలు

తమ్మిలేరు చెక్‌డ్యాం వద్ద నీటిలో పడి తండ్రీకొడుకుల మృతి

పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తమ్మిలరు చెక్‌డ్యాం వద్ద నీటిలో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కొడుకు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపట్టారు.

కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ

తిరుమల , జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థాపం పాలకమండలి మరికాసేట్లో సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏడుగురు బోర్డు సభ్యులు ఎదురుదాడికి సిద్ధమయ్యారు దాంతో పాలకమండలి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బుధవారం…

తిరుమలలో నేటి నుంచి డ్రస్‌కోడ్‌ అమలు

తిరుమల, జనంసాక్షి: తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు విఐపి బ్రేక్‌ దర్శనంలో తప్పనిసరి సాంప్రదాయం దుస్తులు ధరించాలని టిటిడి నిర్ణయించింది. ఈ సాంప్రదాయ దుస్తుల వస్త్రదారణ విధానం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే శ్రీవారి ఆర్జిత…

అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడి నిర్బంధం

నెల్లూరు : అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడిని నిర్బంధించిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం తాలుచింతలలో చోటుచేసుకుంది. చేసిన అప్పు చెల్లించకపోవడంతో యువకుడిని 4 రోజులుగా వ్యాపారి తన ఇంటిలో నిర్బంధించాడు. ఈ విషయం జిల్లా ఎస్పీ…

కూతురు సహా తల్లి ఆత్యహత్యాయత్నం

విశాఖ, జనంసాక్షి: విశాఖ అనకాపల్లి మండలం సుందరయ్యపేటలో కూతురు సహా ఓ తల్లి ఆత్యహత్యాయత్నం చేసింది ఈ ఘటలనలో తల్లి మృతి చెందాగా. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల…

నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని థరూర్‌ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌…

ఛార్జీల పెంపుపై బొత్సను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌ ,జనంసాక్షి: విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల బుధవారం రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. బస్‌పాసుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ వారు ఈ సందర్భంగా బొత్సకు వినతిపత్రిం సమర్చించారు.

సాయంత్రం ఢీల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు సాయంత్రి ఢీల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత్రి సోనియా, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో సహా పలువురు హైకమాండ్‌ పెద్దల్ని కలిసే అవకాశం…

ఒకే నంబర్‌తో ముగ్గురికి హాల్‌టిక్కెట్లు

వరంగల్‌ : ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణంగా వారిని పరీక్ష…

సింహాచలం గోశాల నుంచి గోవుల తరలింపు

విశాఖ: సింహాచలం గోశాలలో గోవులు మృత్యువాత పడుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. సింహాచలం గోశాల నుంచి 350 గోవులను కృష్ణాపురంలోని తాత్కాలిక షెడ్లకు తరలించారు. మెరుగైన వైద్యం, సౌకర్యాల కోసం గోవులను తరలించనట్లు అధికారులు తెలిపారు. సింహాద్రి అప్పన్నకు…