Tuesday, 17 November 2026

వార్తలు

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. నాలుగు వందల మందికిపైగా గాయపడినట్లు చెనా సెంట్రల్‌ టెలివిజన్‌ వెల్లడించింది.…

సీఎంను కలిసిన తెదేపా తెలంగాణ నేతలు

హైదరాబాద్‌: తెదేపా తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిశారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికే కేటాయించాలని నేతలు సీఎంను కోరారు.

రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌: కాజీపేట వద్ద రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బీటెక్‌ విద్యార్థులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు తెలిపారు.

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా…

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీవర్షాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. శ్రీకాళం, విజయనరం , ఉభయ గోదావరి జిల్లాలు , చిత్తూరు, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం…

హౖదరాబాద్‌ చేరుకున్న శరద్‌ పవార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌ పవార్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు శరద్‌…

మహిళపై దుండగుడి దాడి, ముఖంపై గాయం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద మహిళపై ఓ దుండగుడు దాడి చేశాడు . దాడిలో మహిళ ముఖ్యంపై తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడిన బాధితురాలిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.…

ఢీల్లీ అత్యాచార ఘటనపై వైఎస్‌ సీపీ నిరసన

అనిగండ్లపాడు, జనంసాక్షి: అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపింది. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అనిగండ్లపాడులో శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల,…

ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో కోల్పోయి ఒకరి మృతి

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని బోర్‌రామ్‌ గ్రామంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి బెల్ల గంగాధర్‌ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి పంజాబ్‌, హైదరాబాద్‌ జట్ల…

వర్షాలు భారీగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షానకి పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. పశ్యిమ గోదావరి జిల్లా కాకినాడలో ఉరుములతో కూడిన…