Monday, 16 November 2026

వార్తలు

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29.260గా ఉంది. కిలో వెండి ధర రూ. 58,750గా…

జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు

న్యూఢిల్లీ: అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా జమ్మూకాశ్మీర్‌లో 4 రోజులపాటు ఆందోళనలు, బంద్‌కు…

తీహార్‌ జైల్లోనే అఫ్జల్‌గురు మృతదేహం ఖననం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఈ ఉదయం 8 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం జైల్లోనే అతని మృత దేహాన్ని ఖననం చేశారు. అతన్ని ఉరితీసిన ప్రదేశానికి…

అత్యంత గోప్యంగా ఉరిశిక్ష ప్రక్రియ పూర్తి

న్యూఢిల్లీ: ముంబయి దాడుల ఘటనలో అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష ప్రక్రియను పూర్తిచేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ నుంచి ఉరిశిక్ష అమలు వరకూ…

చట్టపరమైన నియమాలు పాటించే ఉరి అమలు చేశాం : షిండే

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్షకు అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలియజేశారు. జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు చెప్పారు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరిస్తూ…

మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. ముంబయి దాడుల ఘటనలో పాక్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడంతో అతనికి గత ఏడాది ఉరిశిక్షను అమలు చేసిన…

దేశవ్యాప్తంగా భద్రత పెంపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో కీలక దోషి అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు  చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కర్ఫ్యూ విధించారు. దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. హైదరాబాద్‌, బెంగళూరులలో…

అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయం : భాజపా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకి ఉరిశిక్ష అమలు సరైన నిర్ణయమని భాజపా వ్యాఖ్యానించింది. ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు.…

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురు మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 11 నుంచి ఢిల్లీలో గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి రెండురోజులపాటు రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించనున్న 44వ గవర్నర్ల సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షత వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌…