Saturday, 14 November 2026

వార్తలు

రాజకీయాల్లో మార్పు తెస్తాంఅమ్‌ ఆద్మీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి):: రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అమ్‌ ఆద్మీ నేషనల్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. సోమవారంనాడు ఆయన ఒక న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ మనం రాసుకున్న…

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై 184 కింద చర్చకు డిమాండ్‌ అఖిలపక్ష సమావేశంలో బిజెపి, టిడిపి పట్టు ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,నవంబర్‌26 (జనంసాక్షి): చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.  ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని…

ఆనాటి మారణహోమంలోఅమరులకు కేంద్ర మంత్రి నివాళి ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తి!

ముంబయి, నవంబర్‌ 26  (జనంసాక్షి): ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు నివాళులర్పించింది. చౌపట్టిలోని పోలీసు జింఖానా మైదానంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే పాల్గొని…

సోనియాతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని వినతి సానుకూలంగా స్పందించిన మేడమ్‌

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌గా చర్చిస్తోందని, సమస్య పరిష్కారం కోసం ఓపిక పట్టాలని తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలకు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సూచించారని సమాచారం. తెలంగాణపై తొందరపాటు నిర్ణయాలు లేదా అనవసర ఆందోళనలు అక్కర్లేదని…

తెలంగాణపై స్పష్టత ఇవ్వాల్సిందే: కోదండరామ్‌

మహబూబ్‌ నగర్‌,నవంబర్‌26(జనంసాక్షి): తెలంగాణ అమరులకు  జగన్‌ సోదరి షర్మిల సలాం చేయడం సరిపోదని, అమరుల త్యాగాలను గుర్తించి, వారి ఆశయాల సాధన దిశగా నడవాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణపై ఆ పార్టీ స్పష్టత…

భారీ ఎత్తున గంజాయి, బంగారు బిస్కట్లు స్వాదీనం

వరంగల్‌: పదిన్నర కిలోల గంజాయి, పన్నెండున్నర తులాల బంగారు బిస్కట్లు స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్‌ రోడ్‌ వద్ద ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ వాహనాల తనిఖీ…

ముఖ్యమంత్రిని పిలిపించి మాట్లాడుతాం: వయలార్‌ రవి

డిల్లీ: ముఖ్యమంత్రిని డిల్లీ పిలిపించి ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ కోరతామని, పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవి తెలిపారు. కేసిఆర్‌ను చర్చలకు ఎవరు పిలిచారన్నది అప్రస్తుతమని, చర్చలు మాత్రం…

ఎన్‌ఎస్‌ఈ కి కొత్త సీఈవోగా చిత్రా రామకృష్ణ

ముంబయి: నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజి(ఎన్‌ఎస్‌ఈ)కి కొత్త సీఈవో ఎండీగా చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు.ఆమె నియామకం వచ్చే ఎడాది ఏప్రిల్‌ ఒకటినుంచి అమలులోకి వస్తుంది.

నల్గొండలో తండాకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నల్గొండ: మిర్యాలగూడ మండలంలోని కొన్వానాయక్‌తండాకి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం గమనార్హం. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో కోతకొచ్చిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేపటిలోగా  విద్యుత్‌  సరఫరా పురరుద్ధరించకపోతే వరి పంటను తగలబెడతామని రైతులు…

‘ఆమ్‌ ఆద్మీ’పై అప్పుడే విమర్శలా? : కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రారంభమై రెండు రోజులన్నా కాకముందే ఆమ్‌ ఈద్మీ పార్టీపై కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారని పార్టీ వ్యవస్థాపకులు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో నిలిచి పోరాడి గెలవాలని మంత్రులు సవాలు విసురుతున్నారని, రాబోయే ఎన్నికల్లో సామాన్య ప్రజలే…