Friday, 6 November 2026

తెలంగాణ

జేఈఈ(మెయిన్‌) ఫలితాలు విడుదల

హైదారాబాద్‌: జేఈఈ(మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. ర్యాంక్‌ల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై మొదటి వారంలోగా జాతీయ ర్యాంకులను ఖరారు చేస్తారు.

19న ఐసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను నిర్వహించే ఐసెట్‌-2013పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఈనెల 19న విడుదలు చేయనున్నారు. ఈనెల 31న ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. 17వ తేదీన ఐసెట్‌ పరీక్ష జరగనుంది.

బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.

మాస్‌ కాపీయింగ్‌, 52 మండి డిబార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అంబేద్కర్‌ ఓపెస్‌ యూనివ్శటీ డిగ్రీపరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా జరుగుతోంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పరీక్షసెంటర్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 52విద్యార్థులను అధికారులు పట్టుకుని. వారిని డిబార్‌ చేశారు.

‘5 ఏళ్లలో కాంతనపల్లి పూర్తి చేయండి’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంతనపల్లి ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. 5 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌కు దివంగత ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని గుర్త…

మూడు నేమళ్లు మృతి

గంగాధర: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు మృతి చెందిన నెమళ్లను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.…

కేటీపీఎస్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: కేటీపీఎన్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పీసీసీ ఘనంగా నిర్వహించింది. నాంపెల్లి పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పీసీసీ అధినేత బొత్స పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోస్టల్‌ ప్రక్షాళన. కార్మిక చట్టాల రూపకల్పన…

కార్పోరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోంది. -రాఘవులు

గాంధీచౌక్‌(ఖమ్మం): కార్పొరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోందని దీన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో హరిత విప్లవం పేరుతో…

స్థాయీసంఘాల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పట్టణాభివృద్ధి. మనవనరుల అభివృద్ధి స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. బడ్జేట్‌ పద్దులపై నేతలు సమీక్షిస్తున్నారు.