Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం,ఆగస్టు 22(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కనీసం పదిమంది మృతి చెందారు. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటనజరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా…

కాశ్మీర్‌పై శాంతి చర్చలు

– విపక్షనేతలతో మోదీ భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 22(జనంసాక్షి): కశ్మీర్‌ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష…

టర్కీలో ఆత్మాహుతి దాడి

– 50మంది మృతి అంకారా,ఆగస్టు 21(జనంసాక్షి): టర్కీ మరోసారి బాంబుపేలుడుతో దద్దరిల్లింది. సిరియా సరిహద్దులకు సవిూపంలోని గజియంటెప్‌ సిటీలో ఓ వెళ్లి వేడుకపై శనివారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మంది మృతిచెందగా, 94…

నేడు మన హైదరాబాద్‌కు సిందు

హైదరాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి):విశ్వక్రీడావేదిక రియో ఒలింపిక్స్‌ లో విజయకేతనం ఎగరేసిన పీవీ సింధు రేపు భాగ్యనగరంలో అడుగిడనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత్‌ తరపున విజయ దుందుబి మోగించిన పీవీ సింధు రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పీవీ…

పాక్‌ హింసను ప్రేరేపిస్తోంది

– అరుణ్‌ జైట్లీ జమ్మూ ,ఆగస్టు 21(జనంసాక్షి): కశ్మీరులో హింసను పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తోందని, భారతదేశ సమగ్రతపై దాడి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ళదాడులు, హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని క్షమించేది లేదని…

ప్రధానితో నేడు కాశ్మీర్‌ విపక్షనేతల భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):కశ్మీరులో అల్లకల్లోలం నేపథ్యంలో జమ్మూ-కశ్మీరు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సోమవారం సమావేశం కాబోతున్నారు. ప్రతిపక్ష నేతల బృందానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వం వహిస్తారు. అందరు భాగస్వాములతోనూ…

గయాలో పెట్రోల్‌ బావి

– ఫ్రీ చమురు కోసం క్యూ కట్టిన జనం గయా,ఆగస్టు 21(జనంసాక్షి):టైటిల్‌ చూడగానే.. ఇదేంటి నీళ్ల కోసం బిందెలెత్తుకుని మరీ పోటీపడటం చూశాం.. క్యూలో నిల్చుని నేనంటే నేను అని కొట్టుకున్న వారిని చూశాం పెట్రోలు కోసం బిందెలతో…

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

న్యూదిల్లీ,ఆగస్టు 20(జనంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. తదుపరి గవర్నర్‌గా ఆయన రఘురామ రాజన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఆయన ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌ 4తో ప్రస్తుత…

సింధుపై కనక వర్షం

పివి సింధుకు భారీ నజరానా ప్రకటించిన కెసిఆర్‌ 5కోట్ల నగదు, వేయిగజాల స్థలం..కోరుకుంటే ఉద్యోగం 22న ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయం గోపీచంద్‌ అకాడమికి కోటి నజరానా సాక్షి మాలిక్‌కుకూడా కోటి నజరానా హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో రజత…

పెండింగ్‌కేసులు పెనుసవాల్‌

– సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ సిమ్లా,ఆగస్టు 20(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ చెప్పారు. సిమ్లాలో జాతీయ న్యాయ…