Monday, 2 November 2026

September 2013

తెలంగాణ

రాజీనామాలతో తెలంగాణ ఆగదు : గండ్ర వెంకటరమణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజీనామాలు, ఒత్తిల్లతో తెలంగాణ ఆగదు అని తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రాంతానికో మాట, పూటకో మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచిది…

జాతీయం

రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో మంటలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఇంకా చేరుకోలేదు.

తెలంగాణ

సచివాలయంలో పోటాపోటీగా నిరసనలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ , సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. తెలంగాణ, సమైక్య నినాదాలతో సచివాలయం దద్దరిల్లుతుంది.

తెలంగాణ

సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 7 న ఏపీ ఎన్టీవోలు నిర్వహించే సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి తేల్చిచెప్పారు.  ఎవరైనా ఉద్యోగులు సభకు వస్తే హైదరాబాద్‌లో ఉండే హక్కును కోల్పోతారని ఆయన అన్నారు. 7…

తెలంగాణ

3 నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 3 నుంచి 12 వరకు ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అని ఉన్నత విద్యామండలి తెలిపింది. 13,14 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 17 న సీట్ల కేటాయింపు జరుగనుంది. 23…

జాతీయం

మొయిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్‌ బంకులు రాత్రి వేళ మూసివేయాలని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ లోక్‌సభలో ప్రతిపాదించారు. మొయిలీ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తిరస్కరించారు. పెట్రోల్‌ బంక్‌లు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని…

జాతీయం

గాలి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏఎంసీ కేసులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ పూర్తయిన తర్వాత ఓఎంసీ కేసును పరిశీలిస్తామని కోర్టు చెప్పింది.

జాతీయం

లోక్‌సభ మ. 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేశారు. ఎంపీ శివప్రసాద్‌ ఇందిరాగాంధీ మాస్క్‌…

తెలంగాణ

ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర హైకోర్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి చేరడానికి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొటున్నట్లు తెలిపారు.…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి పతనం కొనసాగుతుంది. నిన్న 65.70 పైసల వద్ద ముగిసిన రూపాయి ఈ రోజు 66.10 పైసల వద్ద ప్రారంభమైంది.