Sunday, 8 November 2026

కరీంనగర్

అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రీజనల్‌ డైరెక్టర్‌

ఇల్లందు: వరంగల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎస్‌. రామనారాయణ రెడ్డి శుక్రవారం ఇల్లందు పట్టణంలో పర్యటించారు. పారిశుధ్ధ్య లోపం అధికంగా ఉన్నందున అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని కిమిషనర్‌ని ఆదేశించారు. అనంతరం ఆయన…

విద్యుదాఘాతానికి గురై రైతు మృతి

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని రేగొండ గ్రామంలో పిట్టల రాజయ్య (65) అనే రైతు విద్యుదాఘాతానికి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కరెంటు మోటారు ఆన్‌ చేయగా కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి…

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్‌,(జనంసాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామగుండం డివిజన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధకంగా నీరు వచ్చి నిలవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ములాయం వెనుక సీఎం కిరణ్‌,చంద్రబాబు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే లగడపాటి రాజగోపాల్‌…

చీరల పంపిణీపై ఎన్నికల విచారణ చేపట్టిన అధికారులు

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం సర్పంచి అభ్యర్థి కె. మధుసూదన్‌ ఓటర్లను చీరలు పంపిణీ చేస్తుండగా ప్రత్యర్థి అలీమహ్మద్‌ పట్టుకున్నారు. సమాచారం అందిన మండల ఎన్నికల పర్యవేక్షణాధికారులు విచారణ చేపట్టారు. 14 చీరలు పట్టుకున్నట్లు తెలిపారు.…

మంథని నియోజకవర్గంలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌

మంథని: మంథని నియోజకవర్గంలోని 112 పంచాయతీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నికల కోసం 3,211 మంది సిబ్బందిని నియమించారు. 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు…

అనారోగ్యంతో ఏఐసీసీ మాజీ ప్రధానకార్యదర్శి మృతి

కరీంనగర్‌: ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆసుపత్రిల చికిత్సపొందుతూ కన్నుమూశారు. గతంలో మలేషియాలో భారత రాయబారిగా కూడా పని చేశారు. ఇందిరాగాంధీ హయాంలో…

కరీంనగర్‌ జిల్లాలో ఆరుగురు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): భారీ వర్షాలకు కరీంనగర్‌ జిల్లా మంథని డివిజన్‌లో వరదల వల్ల 8 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈ వరదలకు జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారని ఆయన…

ఏసీబీ వలలో చిక్కిన సబ్‌జైలు వార్డర్లు

కరీంనగర్‌,(జనంసాక్షి): జగిత్యాల సబ్‌జైలు వార్డర్లు రవీందర్‌రెడ్డి, వేణు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రిమాండ్‌ ఖైదీ తిరుపతి నుంచి రూ. 8 వేలు , 25 కిలోల బియ్యం తీసుకుంటుండగా వార్డర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.