Sunday, 8 November 2026

కరీంనగర్

తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణే: వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): గోదావరిఖని ఎనిమిదవ ఇక్లైన్‌ కాలనీలో అంబేంద్కర్‌ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ వివేక్‌, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డే అని ఆయన తెలిపారు.…

వేములవాడ ఆలయంలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌,(జనంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఆలయ ప్రసాద్‌ కౌంటర్లలో దాడుల నిర్వహించి 1080 టికెట్లు, 380 పులిహోర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు

ఇద్దరికి గాయాలు…… ఇళ్లు ధ్వంసం కరీంనగర్‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీ వద్ద గుట్టల్లో శనివారం సాయంత్రం జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో ఇళ్లపైకి రాళ్లు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలుకాగా పలు…

ఏసీబీకి చిక్కిన మల్యాల సబ్‌ట్రెజరీ అధికారి

కరీంనగర్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ మల్యాల సబ్‌ ట్రెజరీ అధికారి భాస్కర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫించన్‌ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

బంద్‌ ప్రశాంతం

కరీంనగ్‌ క్రైం: టిఆర్‌ఎస్‌, ఓయూ జెఏసి పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. తిమ్మాపూర్‌ మండలంలో ఆర్‌టిసి బస్సు, లారీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేములవాడ, గోదావరిఖని బస్సుడిపోలకు టిఆర్‌ఎస్‌ నాయకులు…

బస్సు, లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న బంద్‌ సందర్భంగా ఆందోళనకారులు బస్సు, లారీ అద్దాలు పగులగొట్టారు. తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు, రేణికుంటలో బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేశారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

రేణుకా చౌదరిని విమర్శించిన టీఆర్‌ఎస్‌ నేత వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పచ్చి తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ వివేక్‌ విమర్శించారు. ఆమె పదవుల కోసం పాకులాడే వ్యక్తి అని దుయ్యబట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ చాప్టర్‌క్ష్మీ అమల్లో భాగంగానే…

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

బెజ్జంకి : బెజ్జంకి మండలం గాగిల్లపూర్‌ రాజీవ్‌ రహదారి వద్ద హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వస్తున్న మినీ వ్యాన్‌, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున& సిమెంట్‌ మిక్సర్‌ లారీ ఎదురుగా ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్‌ సీతాఫల్‌మండి, కొంపల్లికి చెందిన…

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య గొర్రెల మందతో గ్రామ శివారులోకి వెళ్లారు. పిడుగుపడటంతో కొమురయ్య అక్కడికక్కడే…

కొండగట్లు హన్మాన్‌ టెంపుల్‌లో భక్తుల కిటకిట

కరీంనగర్‌, (జనంసాక్షి): హనుమాన్‌ జయంతి సందర్భంగా తెలంగణలోకి పవిత్ర పుణ్యక్షేత్రం కొంగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి…