Sunday, 15 November 2026

నల్లగొండ

నర్రా రాఘవరెడ్డికి ప్రముఖల నివాళి

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవ రెడ్డి కి ప్రముఖులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సీపీఎం కేంద్ర కమిటి…

ఉగ్రవాదుల శవాలు జనగామకు తరలింపు

నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన ఐదుగురు ఉగ్రవాదుల శవాలను వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శవాలకు కాసేపట్లో పోస్టుమార్టం చేయనున్నట్టు జనగామ డీఎస్పీ నరేందర్ తెలిపారు.

నల్గొండ జిల్లా ఆలేరులో భారీ ఎన్‌కౌంటర్‌

ఐదుగురు ఉగ్రవాదులు హతం భువనగిరి, ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు – వరంగల్‌ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారిపై ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. వికారుద్దీన్‌ ముఠాను ఉదయం…

నల్గొండ ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్..

నల్గొండ : జిల్లా ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించారు.

అరవవల్లిలో పోలీసుల కూంబింగ్..

నల్గొండ : అరవవల్లి గుట్టలు..ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రే హౌండ్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కొద్దిసేపట్లో దుండగులు ఎవరో తేలనుంది

నల్గొండ:  నల్గొండ జిల్లా  మోత్కూరు మండలం  జానకీపురం శివారులో శనివారం ఉదయం  జరిగిన ఎదురు కాల్పుల సంఘటనా స్థలానికి మధ్య ప్రదేశ్ పోలీసులు వచ్చారు. ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ వేలిముద్రలను వారు…

నల్లగొండ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

నల్లగొండ : జిల్లాలోని జానకీపురం ఎన్ కౌంటర్ లో ఇద్దరు సిమి ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే దారులన్నింటి…

యాద్రాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

నల్లగొండ : యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహ్మా స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గుట్టపైకి వాహనాలను పోలీసులు…

గ్యాస్‌లీకై ఇద్దరు మృతి

నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమామ్ పేట సమీపంలోని హెచ్ పీసీఎస్ దగ్గర గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరం-బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్:ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. దుండగుల ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తీవ్రంగా గాయపడిన సీఐ, ఎస్సైలకు మెరుగైన శస్త్ర చికిత్స అందించాలని వైద్యులకు సూచించామన్నారు.