Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

సీమాంధ్రులు తెలంగాణ ఉద్యమంపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోం : టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఉద్యమం.. ప్రజలపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ కో-చెర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు.తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని హితువు పలికారు.ఏపీఎన్జీవోలది ముమ్మాటికి ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమం అని…

యూరియా కోసం రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్‌విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

పాము కాటుతో తల్లీ కూతురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి

తెలంగాణవాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి

మహబూబ్‌నగర్‌ : కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న తెలంగాణ వాదులపై సీమాంధ్ర ఎస్‌ఐ దాడి చేశారు. లాఠీచార్జ్‌ చేశారు. ఎస్‌ఐ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ ప్రవర్తనపై…

మహబూబ్‌నగర్‌ జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 8 డిపోల్లో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో పాటు తెలంగాణ వాదులు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనలకు దిగారు. దీంతో జిల్లా…

ద్విచక్రవాహనం కారు ఢీ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొత్తూరు మండలం నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహంతో స్థానికులు రోడ్డుపై భైఠాయించారు. దీంతో…

వైద్య సదస్సును ప్రారంభించిన గవర్నర్‌ నరసింహన్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి):ఎస్వీఎస్‌ ఆస్పత్రిలో మూడు రోజులపాటు జరగనున్న 41 వ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఎస్పీ నాగేంద్రకుమార్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి గవర్నర్‌కు స్వాగతం పలికారు. గవర్నర్‌…

మహబూబ్‌నగర్‌ చేరుకున్న గవర్నర్‌

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ మహబూబ్‌గర్‌ చేరుకున్నారు. ఎస్వీన్‌ వైద్యకళాశాలలో ఏపీ ఎపికాన్‌ సదస్సులో నరసింహన్‌ పాల్గొననున్నారు.

ప్రత్యేక తెలంగాణ నిర్ణయం శిలాశాసనం

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌ తెలంగాణలో భాగమేనని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం శిలాశాసనమని ఆయన మహబూబ్‌నగర్‌లో అన్నారు. నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు చూసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలకు అక్కడి…