Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ప్రతినిధి అభినందించిన అధికారి

కొల్లాపూర్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద బుధవారం నాలుగో పంపు మోటారు ట్రయల్‌ రన్‌ చేశారు. ఇప్పటి వరకు 1,2,3 పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నాలుగో పంపు మోటారు విజయవంతం అయినట్లు ప్రాజెక్టు అధికారులు…

భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి తీసింది

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి తాండాకు చెందిన పార్వతి (28)ని ఆమె భర్త విజయ్‌ శనివారం రాత్రి హత్య చేశాడు. తాండా వాసులు, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం కుటుంబంలో భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి…

వినోద్‌ అంతిమయాత్రకు ఆంక్షలు అవమానకరం: జూపల్లి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొల్లాపూర్‌ నియోజకవర్గం కొండూరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వినోద్‌కుమార్‌ అంతిమయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించడం అవమానకరమని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతిమయాత్రకు అనుమతించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య

మహాబూబ్‌ నగర్‌ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జగన్మోహన్‌ను కాల్చి చంపారు. అతని స్వగ్రమంలో పంచాయతీ…

8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): నారాయణపేటలోని బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు యాసిడ్‌తో దాడి చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కిందుర్గు మండలం తంగెళ్లపెల్లి వీఆర్వో రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కళ్లలో కారం చల్లి దొంగతనం

మహబూబ్‌నగర్‌ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్‌ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి

వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

పాతకక్షలతో మహిళపై ప్రత్యర్థుల దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): దేవరకద్ర మండలం గూరకొండలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షలతో ప్రత్యర్థులు మహిళపై కత్తులతో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.