Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ట్రంప్ జనవరి 20న వైట్ హౌజ్ ప్రవేశం చేయనున్నారు. ఆరోజు ఆయన 45వ…

ట్రంప్కు ఓటు వేయని బుష్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు కానీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు కానీ ఓటు వేయరాదని జార్జిబుష్ నిర్ణయించుకున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు ఓటు వేయకపోవడం ట్రంప్కు ఇబ్బందికర పరిణామం. జార్జిబుష్ నిర్ణయం బాధాకరమని అన్నారు.…

244 స్థానాల్లో ట్రంప్ జయభేరి..!!

ఒహియోలో ట్రంప్‌ గెలుపు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపింది. ఒహియోలో ఎవరు గెలిస్తే వారే అధ్యక్షుడని సెంటిమెంట్ కూడా ఉండటంతో ట్రంప్ మద్ధతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 210 స్థానాల్లో హిల్లరీ, 244 స్థానాల్లో ట్రంప్ గెలుపొందారు. విజయానికి…

రహస్యంగా దేవాలయాల కూల్చివేత

పెషావర్ లోని పురాతన హిందూదేవాలయాన్ని రహస్యంగా కూల్చివేత ప్రక్రియకు వ్యతిరేకంగా  పాకిస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెషావర్ ఓల్డ్ సిటీలోని 150 సంవత్సరాలు పురాతన దేవాలయాన్ని ఒక కమర్షియల్ ప్లాజా నిర్మించేందుకు కూల్చివేశారు. అత్యంత రహస్యంగా పురాతన హిందూదేవాలయాల…

ఐక్యరాజ్యసమితి పై మండిపడ్డ భారత్

జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్‌పై నిషేధం విధించడంలో ఐక్యరాజ్యసమితి ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని, లేనిపోని రాజకీయాలు చేస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్‌లిస్టులో పెట్టినా, దాని అధినేత…

ట్రంప్ కి భయపడుతున్న మెక్సిక‌న్లు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలిస్తే ? ఆ ఆలోచ‌న వ‌స్తేనే మెక్సిక‌న్లు వ‌ణికిపోతున్నారు. రిపబ్లిక‌న్ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తే, త‌మ‌కు భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని మెక్సికో ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఆ దేశ జాతీయ మార్కెట్లు కూడా గ‌జ‌గ‌జ‌లాడుతున్నాయి. సాధార‌ణంగా…

ముందంజలో ఉన్న హిల్లరీ..!!

ఒక శాతం తేడా నుంచి 12 శాతం దాకా.. తొలి నుంచీ ట్రంప్‌ కన్నా ముందంజలోనే ఉంటున్న హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల రోజుకు కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. వాల్‌‌స్ట్రీట్ జర్నల్‌/ఎన్‌బీసీ న్యూస్‌ తాజా పోల్‌లో తేలిందిది. ఎలక్టోరల్‌…

ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. కాగా దీనివల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బాంటెన్ ప్రావిన్స్ లో లెబాక్ కు నైరుతి వైపున…

అంతరిక్షం నుండి ఓటు..!!

అమెరికాకు చెందిన వ్యోమగాములు ఇద్దరు అంతరిక్షంలోనుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారని నాసా ప్రకటించింది. ప్రస్తుతం అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ఉన్న  వ్యోమగాములు షేన్‌ కిమ్‌బ్రో, కేట్ రూబిన్స్ అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు…

భారత్ పై మళ్ళి నోరు జారిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్ని గంటలలో జరగనుండగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రంగంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. ఐబీఎం సంస్థలో అమెరికన్లను తొలగించి భారత్ సహా ఇతర దేశాల ఉద్యోగులను…