Sunday, 22 November 2026

జాతీయం

కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మిడ్నాపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11మంది కార్యకర్తలు గాయపడ్డారు. మిడ్నాపూర్‌లోని మరో పోలింగ్‌ బూత్‌ వద్ద సీపీఎం…

పౌర విమానాయ సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పౌర విమానయాన సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఐటీడీసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాయ్‌బరేలిలో రాజీవ్‌గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మనీష్‌ తివారీ తెలిపారు.

తొలి తీర్పును 25కి వాయిదా వేసిన న్యాయస్థానం

ఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు వెలువడుతుందని భావించిన తొలి తీర్పును జువెనైల్‌ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నిర్భయ కేసులో అరుగురు నిందితుల్లో ఒకడైన బాలనేరస్థుడి విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వులో ఉంచిన…

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షేన్‌ వార్న్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌కి ఐసీసీ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. జులై 19న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య రెండో యాషెన్‌ టెస్ట్‌ మ్యాచ్‌  విరామసమయంలో వార్న్‌ని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చుకుంటామని ఐసీసీ గురువారం ప్రకటించింది.…

కేవీపీ ఇంట్లో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): హస్తినలో కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడారు. తమ అభిప్రాయాలను కోర్‌ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం ఉంటుందని…

కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, నాయకులు సమావేశ మయ్యారు. కాసేపట్లో వీరంతా దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉద్దీపన పథకాలు కొనసాగిస్తామన్న ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెర్నాంకె ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు…

ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో నేడు తొలి తీర్పు

ఢిల్లీ : ఢిల్లీలో గత డిసెంబరులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో తొలి తీర్పు ఈరోజు వెలువడనున్నట్లు సమాచారం. అరుగురు నిందితుల్లో ఒకరు బాల నేరస్థుడు (17 ఏళ్లు) కావడంతో అతడి విచారణ విడిగాసాగింది.…

ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

24 పైసలు పెరిగిన రూపాయి విలువ

ముంబయి: మార్కెట్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ రూ. 59.41గా నమోదైంది.