Sunday, 29 November 2026

వార్తలు

రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశముంది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 49.7 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ భద్రాచలం…

పాముకాటుకు గురై బాలుడు మృతి

దౌల్తాబాద్‌: మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని చిన్నమాసానపల్లి గ్రామంలో బాలుడు పాముకాటుకు గురై మృతిచెందాడు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అబ్బి(5)ని పాము కాటు వేసిందని, శుక్రవారం తెల్లవారు జాముకి బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరగదు: డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరగదని డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందనేది ఊహాగానమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో నక్సలిజం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. ఏదో జరుగుతుందని ముందుగా ఊహించడం సరికాదని ఆయన అన్నారు.

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం: 77 మంది మృతి

స్పానిష్‌,(జనంసాక్షి): స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్పానిష్‌ నగర శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 77 మంది మృతి చెందారు.  131 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్లున్న రైలు పట్టాలు తప్పడంతో ఐదారు బోగీలు బోల్తా…

సబితా,ధర్మాన కస్టడీపై వాయిదా పడిన తీర్పు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. వారిని జుడిషియల్‌ కస్టడీకి తరలించాలని సీబీఐ అధికారులు పెట్టుకున్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. తీర్పును ఆగష్టు 7…

కేంద్ర కేబినేట్‌ సమావేశం వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్‌ భేటీ వాయిదా పడింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత ఏర్పడిన కారణంగా ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.

మెడికల్‌ కాలేజీలపై ఐటీ దాడులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్‌ కాలేజీలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇవాళ అధికారులు ఐదు కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. కాలేజీల నుంచి దస్త్రాలను స్వాధీనం…

14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాన్‌: ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్ల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. కొంతమంది సాయుధులు బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంపై నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి ఆ దారిలో వెళ్లిన ట్రక్కులన్నిటినీ ఆపి డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తోంది. రంజాన్‌…

ఇరాక్‌లో 14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్లు చెలరేగి పోయారు. బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంలో వెళ్లిన 14 ట్రక్కుల డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తుంది.  కొంతమంది సాయుధులు నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి ఈ ఘాతుకానికి…

విమానాశ్రయం ప్రాంతంలో దుండగుల చేతిలో ఓవ్యక్తి మృతి

విశాఖ: విశాఖ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి మూటలో కట్టి విమానాశ్రయం పరిసరాల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని…