Saturday, 28 November 2026

వార్తలు

దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి నిన్న జరిగిన కోర్‌ కమిటీ పరిమాణాలను, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ ముగిసిన అనంతరం రాష్ట్రపతిని సీఎం కలవనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మరోమారు మోసం చేసింది తెలంగాణ విద్యార్థి పరిషత్‌

హైదరాబాద్‌: కోర్‌ కమిటీ పేరుతో తెలంగాణను మరోమరు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అరోపించింది. యూపీఏ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ…

సెప్టెంబర్‌ 1న టెట్‌, 20న ఫలితాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 1న టెట్‌, 20న ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల స్వాధీనం చేసుకున్నారు.

19 ‘కెవ్వు కేక’ అనిపించేలా సినీ నటుడు అల్లరి నరేష్‌

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌, షర్మిల మాండ్రే జంటగా దేవీప్రసాద్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కెవ్వు కేక’ జాహ్నవి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా…

పార్లమెంట్‌ సమావేశానికి ముందే చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఉత్తరాంధ్రపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

విశాఖ: ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కోసం రోడ్‌మ్యాప్‌ అంశంపై విశాఖపట్నంలోని పార్కు హోటల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ద్రోణం రాజు శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయులు శివశంకర్‌రావు, వరదారెడ్డి, ఆర్‌.వి. రామారావు,…

ఎంబీటీ అధ్యక్షుడు ఆదం మాలిక్‌ కన్నుమూత

హైదరాబాద్‌,(జనంసాక్షి): మజ్లిస్‌ బచావో తహరిక్‌ (ఎంబీటీ) పార్టీ అధ్యక్షుడు మాలిక్‌ (61) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం నమాజ్‌ తర్వాత ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.…

ఎరువుల వ్యాపారి ఇంట్లో పేలుడు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భావనారుషి నగర్‌లో నివాసం ఉంటున్న ఎరువులు, పురుగు మందుల వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నివాస గృహంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఇంటి ముందు భాగంలో ఉన్న సుమారు…

‘ఈల’ వేయనున్న కన్నడ నటుడు సుదీప్‌

హైదరాబాద్‌: రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు సుదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఈల’ కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో సుజాత ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెలుగులో విడుదల చేస్తున్నారు.…