Saturday, 28 November 2026

వార్తలు

వరంగల్‌లో కొనసాగుతున్న జేఈఈ కౌన్సెలింగ్‌

నిట్‌ క్యాంపస్‌: వరంగల్‌ నిట్‌లో జేఈఈ ప్రవేశాల కౌన్సెలింగ్‌, రిపోర్టింగ్‌ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో సీటు లభించిన విద్యార్థులకు నిట్‌లోని రిపోర్టింగ్‌ కేంద్రంలో ధ్రువపత్రాలు పరిశీలించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నారు. అదివారం కూడా కౌన్సెలింగ్‌ ఉండటంతో నిట్‌లో స్టేట్‌…

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని వేపూరులో బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు: సంజీవరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేంశంలో తెలంగాణ పరిష్కారం దొరక్క పోవచ్చని అభిప్రాయపడ్డారు.…

తెలంగాణ అంశంపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్ధన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.

మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

శ్రీశైలం,(జనంసాక్షి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ అజాద్‌ అలయ అధికారులతో స్వాగతం పలికారు.

దిగ్విజయసింగ్‌తో ముగిసిన భేటీ

ఢిల్లీ, (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయసింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల భేటీ ముగిసింది. వీరు దాదాపు 40 నిమిషాల పాటు దిగ్విజయసింగ్‌తో చర్చించారు. కొన్ని మార్పులతో కొత్త సమన్వయ కమిటీని ఏర్పాటు…

పాత భవనాలు కూల్చివేయాలంటూ నోటీసులు పంపిన అధికారులు

భువనగిరి, (జనంసాక్షి): నల్గొండ జిల్లా భువనగిరిలో పాత భవనాలను కూల్చివేయాలంటూ మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. భువనగిరిలో శిథిలావస్థకు చేరిన 37 పాత భవనాలను అధికారులు గుర్తించారు.

వాహనంపై నుంచి పడి కార్మికుడికి గాయాలు

ఖమ్మం,(జనంసాక్షి): కొత్తగూడెం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో వాహనంపై నుంచి జారాపడి నాగయ్య అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తగూడెం పీవీకే-5 భూగర్భ గనుల్లో జరిగిన మరొక ప్రమాదంలో వాహనం టైరు పేలి ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…

బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ అంతిమ యాత్ర

ముంబయి,(జనంసాక్షి): అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ప్రాణ్‌ (93) అంతిమయాత్ర ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత అయిన ప్రాణ్‌ అంత్యక్రియలు ముంబయిలోని…

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ రూరల్‌ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్‌, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్‌ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.