Saturday, 28 November 2026

వార్తలు

కేయూలో ఆందోళన దిగిన విద్యార్థి సంఘాలు

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ వైఖరి నిరసిస్తూ కేయూలో విద్యార్థి సంఘాలు అందోళనకు దిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. అనంతరం హన్మకొండ-కరీంనగర్‌ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో…

దిగ్విజయ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోర్‌కమిటీ సమావేశం చర్చల సారాంశం భవిష్యత్‌లో ఏర్పాటు చేయబోయే సీడబ్ల్యూసీ సమావేశం గురించి వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణపై నిర్ణయమే తరువాయి: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై ఇక నిర్ణయమే తరువాయి అని అయన వెల్లడించారు. త్వరలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని…

సూది మందు వికటించి వ్యక్తి మృతి

మెదక్‌,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.

నామినేషన్‌ పత్రాలను అపహరించిన యువకులు

పెళ్లకూరు, (జనంసాక్షి): నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేషన్‌ కేంద్రం వద్ద వైకాప అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పత్రాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో…

ఉత్తరాఖండ్‌లో పర్యటించన్ను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) తరపున ఓ బృందం ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఎన్‌హెచ్‌ఆర్సీ సభుల బృందం ఉత్తరాఖండ్‌లో పర్యటించి అక్కడ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష…

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు పాల్పడింది యాసిన్‌ భట్కలే -ఎస్‌ఐఏకు ఫొరెన్సిక్‌ విభాగం నివేదిక

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు సంబంధించి ఫోరెన్సిక్‌ విభాగం జాతీయ దర్యాప్తు సంస్థకు నివేదిక సమర్పించింది. పేలుడు జరగడానికి ముందు సీసీ టీవీలో ఉన్న దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ విభాగం నిపుణులు పేలుళ్లకు కుట్ర పన్నింది తీవ్రవాద సంస్థ…

గూడ్స్‌ రైల్లో మంటలు

ఒంగోలు,(జనంసాక్షి): ఉలవపాడు రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్స్‌ రైల్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో స్టేషన్‌ అధికారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటీన సంఘటన…

టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స కు పరాభవం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టెన్‌ జన్‌పథ్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణకు పరాభవం ఎదురైంది. శనివారం సోనియా గాంధీ నివాసంలో భద్రతపై ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల సీఎంతో పాల్గొనేందుకు బొత్స సత్యనారాయణ అక్కడికి వచ్చారు. అయితే అనుమతి లేదంటూ ఆయన్ని…

మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపివేసిన అధికారులు

విజయవాడ, (జనంసాక్షి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌ షీట్‌ మ్యాట్రిక్స్‌లో సీట్లు అందుబాటులో లేవని ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులు అందోళనకు దిగారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు.