Saturday, 21 November 2026

వార్తలు

అద్వానీని కలిసిన భాజపా నేతలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, సీనియర్‌ నేతలు జశ్వంత్‌సింగ్‌, ఉమాభారతి అద్వానీని కలిశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు.

ముంబయిలో భవంతి కూలిన ఘటనలో 7 కు చేరిన మృతుల సంఖ్య

ముంబయి,(జనంసాక్షి):భారీ వర్షాలకు సెంట్రల్‌ ముంబయిలోని మహిమ ప్రాంతంలో సోమవారం రాత్రి ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను బాంద్రాలోని…

బొగ్గు కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బొగ్గు కుంభకోణానికి స్వయంగా ప్రధాని బాధ్యత వహించాలని భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ డిమాండ్‌ చేశారు. 147 సంస్థలకు అప్పనంగా బొగ్గు క్షేత్రాలను కట్టబెట్టారని ఆయన మీడియాతో మాట్టాడేతూ ఆరోపించారు. ఎంపీ నవీన్‌ జిందాల్‌, మాజీ…

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.…

కేయూ ఐకాస నేతల అరెస్టు

వరంగల్‌, (జనంసాక్షి): కూయూ ఐకాస నేతలను కాకతీయ వర్శిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ…

ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదు : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్టీ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి ఏమీ లేదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మోడీ విషయంలో పునరాలోచించకూడదన్న యోచనలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

దాసరి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేపిన సీబీఐ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. రెండు బృందాలుగా…

రెండోపారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్‌.

అద్వానీని కలిసిన సీనియర్‌ నేతలు

న్యూఢిల్లీ, (జనంసాక్షి): పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీని శాంతింపజేసేందుకు భాజపా సీనియర్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ, బల్‌బీర్‌ పుంజ్‌, మురళీధరరావు ఈ ఉదయం అద్వానీని కలిశారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు.