Saturday, 14 November 2026

వార్తలు

కేసీఆర్‌తో కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసం బిజీబిజీగా మారింది. ఇవాళ ఉదయం నుంచి పలువురు తెలంగాణ నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. ఇవాళ సాయంత్రం జేఏసీ నేతలు కోదండరామ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమవ తాజా పరిస్థితులు,…

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు చర్యలు : జెసి

నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం నాడు తన ఛాంబర్‌లో ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సీనియర్‌…

చివరికోర్కెలేదు జైలులోనే అంత్యక్రియలు

హైదరాబాద్‌: బుధవారం పూణేలోని ఎరవాడ జైలులో ఉరిశిక్షకు గురైన పాకిస్తాన్‌ తీవ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌కు ఆ జైలు ఆవరణలోనే అంత్యక్రియలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ ముంబాయిలో ఈ విషయాన్ని వెల్లడించారు. కసబ్‌ చివరి కోర్కె…

ఫ్రంట్‌ ఏర్పాటు వార్తలు అవాస్తవం:కెకె

హైద్రాబాద్‌: పార్టీలకతీతంగా తెలంగాణకోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలలో…

తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ వేదిక:కేటీఆర్‌

హైద్రాబాద్‌: తెలంగాణవాదులందరికీ టీఆర్‌ఎస్‌ వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే రాజకీయ నాయకులందర్నీ టీఆర్‌ఎస్‌ ఆహ్వానిస్తోందని, వారికి ఘన స్వాగతం పలుకుతామన్నారు.

అఫ్జల్‌గురుకు క్షమాభిక్ష నిరాకరణ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక నిందితుడు అఫ్జల్‌గురుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ క్షమాబిక్ష నిరాకరించాడు. ఈ కేసులో దోషులందరికీ ఉరిశిక్షను అమలుచేయనున్నారు. అఫ్జల్‌తోపాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఆరుగురు ఉగ్రవాదులకు కూడా ఆయన క్షమాబిక్ష నిరాకరించారు.…

మరణశిక్ష రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

న్యూఢిల్లీ : మరణశిక్షను రద్దు చేయాలంటూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 110 దేశాలు ఓట్‌ చేయగా భారత్‌ సహా 39 దేశాలు ఈ తీర్మానాన్మి వ్యతిరేకించాయి. అమెరికా, చైనా,…

ఐక్యంగా ఉంటేనే తెలంగాణ:కేకే

హైద్రాబాద్‌: తెలంగాణ నాయకులంతా ఒకటిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కెకె అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో భేటీ అనంతరం మాట్లాడారు.…

610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: 610 జీవో హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వోద్యుగుల భర్తీలో 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల బదిలీ, నియామకాల్లో ఇప్పటి నుంచే ఈ జీవోను అమలు చేయాలని ఉత్తర్వులు పేర్కొంది. మిగిలిన విభాగాల్లో…

దేశవ్యాప్తంగా 16 కొత్తరైళ్లు : రైల్వేశాఖ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పదహారు కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు కొత్త రైళ్లు మన రాష్ట్రంలో ప్రారంభంకానున్నాయి. విశాఖపట్నం -షిర్డీ, కరీంనగర్‌- తిరుపతి, కాకినాడ – సికింద్రాబాద్‌, విశాఖపట్నం చ్నై ఎక్స్‌ప్రెస్‌లను మన…